హైదరాబాదులో నడిరోడ్డుపై కాలిపోయిన పోలీసు వాహనం... వీడియో ఇదిగో!
- ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద ఘటన
- పోలీసులతో వెళుతున్న టాటా సుమో
- ఒక్కసారిగా ఇంజిన్ లోంచి మంటలు
- అప్రమత్తమై వాహనం నిలిపివేసిన డ్రైవర్
హైదరాబాదులో ఓ పోలీస్ వాహనం నడిరోడ్డుపై దగ్ధమైంది. టాటా సుమో వాహనంలో పోలీసులు వెళుతుండగా ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగడంతో ఈ పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఉన్నవారు వెంటనే అప్రమత్తమయ్యారు. డ్రైవర్ వాహనాన్ని నిలిపివేసిన కాసేపటికే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.
ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన వచ్చి మంటలు ఆర్పేశారు. ఈ ఘటనతో ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. టాటా సుమో ఇంజిన్ లో సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.