'మాస్ట్రో' నుంచి వెన్నెల్లో ఆడపిల్ల సాంగ్ రిలీజ్!

  • హిందీ రీమేక్ గా 'మాస్ట్రో'
  • అంధుడి పాత్రలో నితిన్
  • నాయికగా నభా నటేశ్
  • త్వరలో విడుదల తేదీ ప్రకటన
హిందీలో కొంతకాలం క్రితం భారీ విజయాన్ని సాధించిన 'అంధాదున్' సినిమాను, 'మాస్ట్రో' టైటిల్ తో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సుధాకర్ రెడ్డి - లిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ అంధుడిగా కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా నభా నటేశ్ అలరించనుంది.

తాజాగా ఈ సినిమా నుంచి 'వెన్నెల్లో ఆడపిల్ల' అనే సాంగును రిలీజ్ చేశారు. మహతి స్వరసాగర్ ఈ పాటకు బాణీ కట్టారు. శ్రీజో - కృష్ణ చైతన్య కలిసి సాహిత్యాన్ని అందించారు. స్వీకర్ అగస్తీ అనుభవిస్తూ చేసిన ఆలాపన ఈ పాటకు ప్రాణం పోసింది. 'నిమిషమైన నేను నేనుగా లేనే .. నిన్నలోని నిన్ను వదిలి రాలేనే' అనే పద ప్రయోగాలు ఆకట్టుకుంటున్నాయి.  

ఈ సినిమాను ఇటు ఇండియాలోనూ .. అటు విదేశాల్లోను చిత్రీకరించారు. పాటపై ఫ్లాష్ బ్యాక్ విజువల్స్ పోస్ట్ చేయడం వలన, కథ కొంతవరకూ అర్థమవుతుంది. అలాగే పాట చివరలో తమన్నా .. జిషు సేన్ గుప్తా పాత్రలను చూపిస్తూ, సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన పాటల్లో కచ్చితంగా ఇది ఆదరణ పొందుతుందని చెప్పచ్చు. 


More Telugu News