'ఎస్.ఆర్.కల్యాణ మండపం' ఫస్టు డే వసూళ్లు!
- నిన్ననే విడుదలైన సినిమా
- తొలి రోజునే మంచి రెస్పాన్స్
- తెలుగు రాష్ట్రాల్లో 1.6 కోట్ల షేర్
- వసూళ్లు పుంజుకునే ఛాన్స్
కిరణ్ అబ్బవరం .. ప్రియాంక జవాల్కర్ జంటగా 'ఎస్.ఆర్. కల్యాణ మండపం' సినిమా రూపొందింది. ప్రమోద్ - రాజ్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ దర్శకత్వం వహించాడు. సాయికుమార్ - తులసి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై మొదటి నుంచి కూడా క్రేజ్ ఉంది.
నిర్మాతలు ప్రమోషన్స్ విషయంలో వెనకాడకుండా జనంలోకి ఈ సినిమాను తీసుకెళ్లారు. అలాంటి ఈ సినిమా నిన్ననే భారీ స్థాయిలో విడుదలైంది. థియేటర్లు ఓపెన్ అయిన తరువాత ఎక్కువ సినిమాలు విడుదలైంది నిన్ననే. తెలుగు సినిమాలు 5 విడుదల కాగా, వాటిలో ఈ సినిమా వసూళ్ల పరంగా ముందుందనే టాక్ వినిపిస్తోంది.
50 శాతం ఆక్యుపెన్సీతో చాలా చోట్లా హౌస్ ఫుల్ షోలు పడ్డాయని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 1.6 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా చెబుతున్నారు. వీకెండులో వసూళ్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ ఉండటం పట్ల టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.