నిర్మల్‌లో వ్యాపారి కిడ్నాప్ కలకలం
- స్థిరాస్తి వ్యాపారి విజయ్ చందర్ దేశ్‌పాండే కిడ్నాప్
- గంజాల్ టోల్ ప్లాజా వద్ద కిడ్నాపర్ల వాహనాల వివరాలు గుర్తింపు
- రెండు కార్లలో కిడ్నాపర్లు హైదరాబాద్ వైపు వెళ్తుండగా పట్టివేత
తెలంగాణలోని నిర్మల్ పట్టణం దివ్యానగర్‌లోని తన్వి అపార్ట్‌మెంట్‌లో ఉండే స్థిరాస్తి వ్యాపారి విజయ్ చందర్ దేశ్‌పాండేను దుండగులు అపహరించి తీసుకెళ్లడం కలకలం రేపింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లలో వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారు.
అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఉన్న విజయ్ చందర్‌ను లాక్కొని కిందికి వచ్చి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ సమయంలో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కూడా కిడ్నాపర్లు బెదిరించినట్లు తెలిసింది. విజయ్ కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి గంజాల్ టోల్ ప్లాజా వద్ద కిడ్నాపర్ల వాహనాల వివరాలు గుర్తించారు.
రెండు కార్లలో కిడ్నాపర్లు హైదరాబాద్ వైపు వెళ్లినట్లు తేల్చారు. ఆ మార్గంలోని పోలీసులు తనిఖీలు చేపట్టగా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కిడ్నాపర్లకు సంబంధించిన ఒక వాహనాన్ని గుర్తించి, పట్టుకున్నారు. అలాగే, తూప్రాన్ వద్ద పోలీసులకు మరో వాహనం పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంగారెడ్డికి చెందిన కృష్ణారావును ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.