కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ రాసిన తర్వాత.. మరో 113 మంది మా సభ్యులూ లేఖలు
- చర్చనీయాంశంగా మారిన మా ఎన్నికల వ్యవహారం
- మా ఎన్నికలు త్వరగా నిర్వహించాలని లేఖలు
- చిరంజీవి లేఖకు మద్దతు తెలిపేలా స్పందన
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న వారు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికలు జరిపించాలని 'మా' క్రమశిక్షణ కమిటీ చైర్మన్, సీనియర్ నటుడు కృష్ణంరాజుకు చిరంజీవి రాసిన లేఖకు మద్దతు తెలిపేలా 113 మంది మా సభ్యులు స్పందించారు.
కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ రాసిన 24 గంటల్లో ఆయన బాటలోనే నడుస్తూ 113 మంది మా సభ్యులు కూడా కృష్ణంరాజుకు లేఖలు రాశారు. త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ లేఖలపై కృష్ణంరాజు స్పందించాల్సి ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంపై తుది నిర్ణయాన్ని సభ్యులు కృష్ణంరాజుకే వదిలేసినట్లు తెలుస్తోంది.