భారతీయులనే కాదు.. ఆఫ్ఘన్ లో జన్మించిన హిందువులు, సిక్కులను కూడా తీసుకొస్తాం: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్

  • అక్కడున్న వారిని తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమయింది
  • అక్కడున్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు
  • వందే భారత్ మిషన్ మాదిరిగానే ఇప్పుడు  కూడా అన్ని చర్యలు తీసుకుంటాం
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఉన్న మన ఎంబసీ సిబ్బందిని భారత్ సురక్షితంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ దేశంలో పలువురు భారతీయులు చిక్కుకుపోయారు. తమను వెంటనే స్వదేశానికి తీసుకువెళ్లాలని భారత ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ లోని భారతీయులను వెనక్కి రప్పించే ప్రక్రియను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. కేవలం భారతీయులనే కాకుండా, ఆప్ఘన్ లో పుట్టిన హిందువులు, సిక్కులను కూడా భారత్ కు తీసుకొస్తామని తెలిపారు.

తాలిబన్ల రాకతో అక్కడున్న భారతీయ మూలాలున్న వారు ఆందోళన చెందుతున్నారని... తిరిగి రావడానికి వీసాలను దరఖాస్తు చేసుకుంటున్నారని చెప్పారు. 2020లో చేపట్టిన వందే భారత్ మిషన్ మాదిరిగానే ఇప్పుడు కూడా ఆఫ్ఘన్ నుంచి హిందువులు, సిక్కులను ఇక్కడికి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎయిరిండియా విమానాలు కానీ, వాయుసేన విమానాలు కానీ... ఏదో ఒక విధంగా అందరినీ తీసుకొస్తామని చెప్పారు.


More Telugu News