శ్రీనివాస్ గౌడ్, సంతోష్ లకు కేసీఆర్ ప్రశంసలు

  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 2.10 కోట్లసీడ్ బాల్స్ ను వెదజల్లిన వైనం
  • గిన్నిస్ బుక్ రికార్డుల్లో మహబూబ్ నగర్ జిల్లాకు స్థానం
  • జిల్లా పచ్చదనంతో కళకళలాడుతోందన్న కేసీఆర్
సమైక్యాంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లా వలసలు, ఆకలి చావులకు నిలయంగా ఉండేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు పచ్చదనంతో జిల్లా కళకళలాడుతోందని చెప్పారు. హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 2.10 కోట్ల సీడ్ బాల్స్ ను రికార్డు స్థాయిలో తయారు చేసి జిల్లా వ్యాప్తంగా వెదజల్లారు.

ఈ సీడ్ బాల్స్ ను మహిళా సంఘాల ద్వారా తయారు చేయించారు. వీటిని కొండలు, గుట్టల ప్రాంతాల్లో వెదజల్లారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. గిన్నిస్ బుక్ రికార్డు జ్ఞాపికను కేసీఆర్ చేతుల మీదుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరినీ సీఎం అభినందించారు.


More Telugu News