ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. విజయవాడలో పలుచోట్ల రహదారులపై నిలిచిన నీరు!
- కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
- కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వర్షాలు
- గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోనూ వాన
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని విదర్భతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, అల్పపీడన ద్రోణి ప్రభావం వల్లే ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ప్రకాశం జిల్లాలోని ఈపురుపాలెం, వేటపాలెం ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే, విజయవాడలో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో మహాత్మా గాంధీ రోడ్డు, బెంజి సర్కిల్, ఆటోనగర్, కానూరు ప్రాంతాల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కాలువల నుంచి నీరు బయటకొచ్చి రోడ్లపై పారుతోంది. అలాగే, మొగల్రాజపురం, భవానీపురం, తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. కేసరపల్లి, సావర గూడెంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.