‘మెగా వేవ్’ వస్తోంది జాగ్రత్త.. క్రేజీ కాంబోలో చిరంజీవి
- డైరెక్టర్ బాబీతో చిరు 154వ సినిమా
- రేపు పోస్టర్ ఆవిష్కరణ
- ట్విట్టర్ లో వెల్లడించిన మైత్రి మూవీ మేకర్స్
మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధమైపోయింది. మెగాస్టార్ చిరంజీవి జోష్ లో ఉన్నారు. వరుసబెట్టి సినిమాలు చేస్తూ అభిమానుల్లోనూ జోష్ నింపుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న ఆయన.. మరో మూవీని పట్టాలెక్కించేస్తున్నారు. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకీ మామ వంటి సినిమాలను రూపొందించిన డైరెక్టర్ బాబీతో తన 154వ సినిమా కోసం జట్టు కడుతున్నారు. రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా సినిమాను ప్రకటించనున్నారు.
ఆ సినిమాను నిర్మించనున్న మైత్రి మూవీ మేకర్స్ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది. సునామీ వస్తోంది జాగ్రత్త అంటూ ట్వీట్ చేసింది. ‘‘రేపు సాయంత్రం 4.05 గంటలకు మెగా వేవ్ తీరాన్ని తాకుతుంది. అందరి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే మెగా పోస్టర్ వచ్చేస్తోంది’’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.