లాభాలు తెచ్చిన 'SR కల్యాణ మండపం'
- ఇటీవల వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్
- కిరణ్ జోడిగా ప్రియాంక జవాల్కర్
- థియేటర్ల దగ్గర పెరిగిన సందడి
- సాయికుమార్ నటన హైలైట్
కిరణ్ అబ్బవరం - ప్రియాంక జవాల్కర్ జంటగా రూపొందిన 'ఎస్.ఆర్. కల్యాణ మండపం' సినిమా, ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోద్ - రాజు కలిసి నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి ప్రమోషన్లు ఒక రేంజ్ లో చేశారు. అందుకు తగిన ఫలితం థియేటర్ల దగ్గర కనిపించింది. ఆ వారంలో విడుదలైన సినిమాల్లో ఈ సినిమానే మంచి టాక్ తెచ్చుకుని దూసుకుపోయింది.
రెండువారాల్లో ఈ సినిమా 8.30 కోట్ల షేర్ ను రాబట్టిందని అంటున్నారు. ఈ సినిమా పెట్టుబడితో పోల్చుకుంటే మంచి లాభాలనే తెచ్చిందని అంటున్నారు. డిస్త్రిబ్యూటర్లు చాలా హ్యాపీగా ఉన్నారని చెబుతున్నారు. కథాకథనాలు .. యాక్షన్ తో ముడిపడిన ఎమోషన్ .. సాయికుమార్ నటన ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ కావడం వలన ఈ సినిమా ఇంతగా వసూళ్లను రాబట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.