గుంటూరులో ఇద్దరు మైనర్ బాలురు, ఇద్దరు బాలికల అదృశ్యం
- ఒకేసారి నలుగురు మిస్సింగ్
- నలుగురూ నెహ్రూనగర్ ప్రాంతానికి చెందినవారే!
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
- అధికారులను అప్రమత్తం చేసిన ఎస్పీ
గుంటూరులో ఒకేసారి ఇద్దరు మైనర్ బాలురు, ఇద్దరు మైనర్ బాలికలు కనిపించకుండా పోయారు. వీరు నలుగురు నగరంలోని నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందినవారు. అదృశ్యమైన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. దీనిపై గతరాత్రి కొత్తపేట పోలీసులకు బాలల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
కాగా, ఈ ఘటనపై గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. సీఐ, ఎస్సై స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు షురూ చేశారు. మైనర్ బాలలు ఊరు విడిచి వెళ్లారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించారు.