కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన రిలయన్స్... తొలి దశ పరీక్షలకు అనుమతి

  • రిలయన్స్ లైఫ్ సైన్సెస్ లో అభివృద్ధి  
  • క్లినికల్ ట్రయల్స్ కు దరఖాస్తు
  • ఇది రెండు డోసుల వ్యాక్సిన్. 
  • 58 రోజుల పాటు తొలి దశ ట్రయల్స్
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారుచేసింది. రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ కు చెందిన పరిశోధకులు ఈ రీకాంబినెంట్ ఆధారిత వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. ఇది రెండు డోసుల వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ కు తొలి దశ పరీక్షల నిమిత్తం కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ లైఫ్ సైన్సెస్ సెంటర్ లో రెండు నెలల పాటు వలంటీర్లపై తొలి దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. తమ వ్యాక్సిన్ ను వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్ చర్యలు తీసుకుంటోంది.


More Telugu News