రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం నింపేందుకే పాదయాత్ర చేస్తున్నాను: బండి సంజయ్

  • దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాటతప్పారు
  • దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న మాటను నెరవేర్చలేదు
  • దళిత బంధు పేరిట దళితులను వంచించే కార్యక్రమం చేపట్టారు
  • బీసీల్లో కూడా చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ జెండా ఊపి ప్రారంభించారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ పాదయాత్ర జరుగుతోంది. అంతకు ముందు బహిరంగ సభలో  బండి సంజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.

దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మాటతప్పారని, అలాగే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న మాటను నెరవేర్చలేదని విమర్శించారు. దళిత బంధు పేరిట దళితులను వంచించే కార్యక్రమం చేపట్టారని అన్నారు. బీసీల్లో కూడా చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు. 27 మంది బీసీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత బీజేపీదేనని చెప్పారు. రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం నింపేందుకే పాదయాత్ర చేస్తున్నానన్నారు.


More Telugu News