నాయకుల ఒత్తిళ్లు భరించలేమంటూ.. సామూహిక సెలవులో అనంతపురం జిల్లా ఎంపీడీవోలు!
- వైసీపీ నేతల్లో వర్గపోరు
- ఒత్తిళ్లు, బెదిరింపుల కారణంగా అధికారుల నిర్ణయం
- సామూహిక సెలవులో వెళ్లేందుకు అనుమతి కోరుతూ జెడ్పీ సీఈవోను కోరిన వైనం
అనంతపురం జిల్లా తలుపుల మండలంలోని ఎంపీడీవోలు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది సామూహిక సెలవులో వెళ్తున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది. మండలంలో వైసీపీ నాయకుల మధ్య వర్గ పోరుతోపాటు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు భరించలేకే వారీ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
తమ పని తాము స్వేచ్ఛగా చేసే వీలు లేకుండా పోయిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్గ పోరు కారణంగా ఒక పనిని ఒకరు చేయమంటే, మరొకరు వద్దంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పనికి రాజకీయ రంగు పులమడం, విమర్శించడం, బెదిరించడాన్ని తాము తట్టుకోలేకపోతున్నామని వాపోయిన ఎంపీడీవో విష్ణుప్రసాద్.. తనతోపాటు సూపరింటెండెంట్, ఈవోపీఆర్డీ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టు, నలుగురు పంచాయతీ కార్యదర్శులు నేటి నుంచి సామూహిక సెలవులో వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జడ్పీ సీఈవోను కోరడం జిల్లాలో చర్చనీయాంశమైంది.