ఓ ఇంటివాడు కాబోతున్న ముక్కు అవినాశ్.. ఘనంగా నిశ్చితార్థం!
- అనుజతో అవినాశ్ కు నిశ్చితార్థం
- సరైన వ్యక్తి జీవితంలోకి వస్తున్నప్పుడు వేచి చూడాల్సిన అవసరం లేదన్న అవినాశ్
- త్వరలోనే వివాహం జరుగుతుందని వెల్లడి
బిగ్ బాస్ ఫేమ్, హాస్య నటుడు ముక్కు అవినాశ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అనుజతో కలిసి త్వరలోనే అవినాశ్ ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ సందర్భంగా అవినాశ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ... సరైన వ్యక్తి మన జీవితంలోకి వస్తుంటే వేచి చూడాల్సిన అవసరం లేదని చెప్పాడు. తమ కుటుంబాలు కలిశాయని... అనుజతో నిశ్చితార్థం అయిందని తెలిపాడు.
పెళ్లి ఎప్పుడు? అని మీరందరూ తనను ఎన్నోసార్లు అడిగారని... అతి త్వరలోనే నా అనుజతో వివాహం జరుగుతుందని చెప్పాడు. ఎప్పటి మాదిరే మీ అందరి ఆశీస్సులు తనకు ఉండాలని కోరాడు.
కరోనా నేపథ్యంలో ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు అవినాశ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీముఖి, మెహబూబ్, నోయల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.