బాలీవుడ్ యువ నటుడు సిద్ధార్థ్ శుక్లా మృతి
- గుండె పోటుకు గురైన సిద్ధార్థ్
- ముంబై కూపర్ ఆసుపత్రికి తరలింపు
- అప్పటికే మృతి చెందినట్లు చెప్పిన వైద్యులు
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా(40) మృతి చెందాడు. ఆయన ఈ రోజు ఉదయం ఇంట్లో గుండెపోటుకు గురికాగా, ఆయనను కుటుంబ సభ్యులు కూపర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. సిద్ధార్థ్ కు తల్లి, ఇద్దరు అక్కలు ఉన్నారు.
బుల్లితెర నటుడిగానూ సిద్ధార్థ్ ప్రేక్షకులకు సుపరిచితుడు. ముఖ్యంగా 'బాలికా వధు' (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌లో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. మొదట మోడలింగ్ చేసి, 2008లో బుల్లితెర నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అనంతరం నటనలో మంచి గుర్తింపు తెచ్చుకుని బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు.
2014లో కరణ్ జొహార్ నిర్మించిన 'హంప్టీ శర్మకి దుల్హానియా' ఆయన నటించిన తొలి చిత్రం. సిద్ధార్థ్ శుక్లా బిగ్‌బాస్ సీజన్ 13 విజేతగానూ నిలిచాడు. బిగ్ బాస్ 13లో గెలవడంతో ఆయనకు డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచీ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ సమయంలో ఆయన మృతి చెందడం తమను షాక్ కు గురి చేసిందంటూ బాలీవుడ్ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.