పంజ్‌షీర్ ప్రవేశ మార్గాలన్నీ మా అధీనంలోనే ఉన్నాయి.. తాలిబన్లను రానివ్వం: ప్రతిఘటన దళం
- కొంత భూభాగాన్ని ఆక్రమించామంటూ తాలిబన్ల అసత్య ప్రచారం
- తాలిబన్ల యత్నాలను సమర్థంగా తిప్పికొట్టాం
- అనేక మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామన్న
ఆప్ఘనిస్థాన్‌లోని పంజ్‌షీర్ ప్రావిన్స్‌లోకి తాలిబన్లు ప్రవేశించలేకపోతోన్న విషయం తెలిసిందే. అక్కడి ప్రతిఘటన దళం చేస్తోన్న పోరాటమే ఇందుకు కారణం. అయితే, ఆ ప్రాంతంలోకి కూడా తాము ప్రవేశించినట్లు తాలిబన్లు చెప్పుకొంటున్నారు.
దీనిపై పంజ్‌షీర్ తిరుగుబాటు దళం స్పందించింది. ఆ ప్రాంతమంతా తమ అధీనంలోనే ఉందని ప్రకటించింది. కొంత భూభాగాన్ని ఆక్రమించామంటూ తాలిబన్లు అసత్య ప్రచారం చేసుకుంటున్నారని పంజ్‌షీర్ దళ సభ్యులు వివరించారు. ఆ ప్రాంతంలోకి ప్రవేశించాలని తాలిబన్లు పలుసార్లు ప్రయత్నించారని, అయితే, వారి యత్నాలను సమర్థంగా తిప్పికొట్టామని చెప్పారు.
గతరాత్రి కూడా తాలిబన్లు దాడికి యత్నించారని, దీంతో అనేక మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని తెలిపారు. పంజ్‌షీర్ ప్రవేశ మార్గాలన్నీ తమ అధీనంలోనే ఉన్నాయని తెలిపారు. ఒకవేళ తాలిబన్లు రెచ్చిపోయి వస్తే వారిని నరకానికి పంపుతామని హెచ్చరిక చేశారు. కాగా, తాలిబన్లకు భయపడకుండా పంజ్‌షీర్ వాసులు చేస్తోన్న పోరాటం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.