బెంగళూరులో దారుణం.. ఏపీ ఐటీ ఉద్యోగినిపై నైజీరియన్ల అత్యాచారం
- రెండు రోజుల క్రితం బాధితురాలి ఫిర్యాదు
- అరెస్ట్ వివరాలు నైజీరియా రాయబార కార్యాలయానికి
- వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగినిపై బెంగళూరులో అత్యాచారం జరిగింది. బాధితురాలు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని నైజీరియాకు చెందిన అబుజి ఉబాకా, టోనీలుగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, నిందితుల అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను నైజీరియా రాయబార కార్యాలయానికి పంపినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి వివరాలు వెల్లడించని పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆమెను ఆసుపత్రికి పంపినట్టు తెలిపారు.