రాంచరణ్, శంకర్ సినిమా ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా బాలీవుడ్ స్టార్?

  • ఈ నెల 8న సినిమా ప్రారంభోత్సవం
  • ప్రధాన అతిథిగా రణవీర్ సింగ్ అంటూ ప్రచారం
  • సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వానీ
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ నెల 8న ఈ సినిమాను భారీ స్థాయిలో లాంచ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్టు చెపుతున్నారు. చరణ్ కెరీర్ లో ఇది 15వ చిత్రం. కియారా  అద్వానీ  ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతోంది. తమన్ సంగీతాన్ని అందిస్తుండగా... దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అక్టోబర్ మొదటి వారం నుంచి దీని రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని శంకర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చరణ్ పోషిస్తున్న పాత్రపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. స్టూడెంట్ లీడర్ పాత్రను చరణ్ పోషిస్తున్నాడని కొందరు చెపుతుండగా... పక్కా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా వస్తోందని మరికొందరు అంటున్నారు.


More Telugu News