తెలంగాణలో కొత్తగా 306 కరోనా కేసులు
- కరోనా బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం
- గత 24 గంటల్లో 69,422 కరోనా పరీక్షలు
- కోలుకున్న వారి సంఖ్య 366
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బులెటిన్ విడుదలైంది. దీని ప్రకారం రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం నాటికి 306 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,59,313కు చేరింది. అలాగే తాజాగా ముగ్గురు కరోనాకు బలైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని కరోనా మరణాల సంఖ్య 3,883కి పెరిగింది.
ఈరోజు కరోనా నుంచి 366 మంది కోలుకున్నారు. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 69,422 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 63,116 టెస్టులు ప్రభుత్వం నిర్వహించగా, మిగతావి ప్రైవేటు రంగంలో జరిగాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల్లో 79.8 శాతం అసింప్టమాటిక్ అంటే లక్షణాలు బయటకు కనిపించనివే అని ఈ కరోనా బులెటిన్‌లో పేర్కొన్నారు. మిగతా కేసుల్లోనే కరోనా లక్షణాలు కనిపించినట్లు వివరించారు.