పార్టీలో ఉండి వెన్నుపోటు వద్దు.. వెళ్లాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లండి: మధుయాస్కీ
- పార్టీ ఆదేశాలను ధిక్కరించి విజయమ్మ ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ కోమటిరెడ్డి
- చర్యల విషయాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని వ్యాఖ్య
- విజయమ్మ నిర్వహించినది రాజకీయ సమ్మేళనమని విమర్శ
కాంగ్రెస్‌ను వీడాలనుకుంటున్నవారు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని, పార్టీలోనే ఉండి వెన్నుపోటు మాత్రం పొడవొద్దని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కీ కోరారు. వైఎస్ విజయమ్మ ఇటీవల నిర్వహించినది ఆత్మీయ సమ్మేళనం కాదని, అది రాజకీయ సమ్మేళనమని విమర్శించారు. దానికి వెళ్లొద్దని పార్టీ ఆదేశించినా కొందరు వెళ్లారని అన్నారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రాజకీయ వేదికపైకి వెళ్లి మాట్లాడడం వల్ల పార్టీకి నష్టమే జరుగుతుందన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, తానైనా ఎదిగామంటే అది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వల్లేనన్నారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి విజయమ్మ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అనే విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. వైఎస్ బతికుంటే అసలు తెలంగాణ రాష్ట్రమే ఏర్పడేది కాదన్న విజయమ్మ వ్యాఖ్యలను సమర్థిస్తారా? అని మధుయాస్కీ ప్రశ్నించారు.