జంట న‌గ‌రాలుగా విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం అభివృద్ధి చెందుతాయి: విజ‌య‌సాయిరెడ్డి

  • భోగాపురం విమానాశ్ర‌యాన్ని అభివృద్ధి చేస్తాం
  • విశాఖ‌-భోగాపురాన్ని అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం 
  • పురుషోత్తం ప‌ట్నం నుంచి విశాఖ‌కు తాగునీటి కార్య‌క్ర‌మం
విశాఖ‌, విజ‌య‌న‌గ‌రంపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... జంట న‌గ‌రాలుగా విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం అభివృద్ధి చెందుతాయని చెప్పారు. అలాగే, భోగాపురం విమానాశ్ర‌యాన్ని కూడా అభివృద్ధి చేస్తామ‌ని వివ‌రించారు. విశాఖ‌-భోగాపురాన్ని అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. పురుషోత్తం ప‌ట్నం నుంచి విశాఖ‌కు తాగునీటి కార్య‌క్ర‌మం చేప‌డుతున్నామ‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.

కాగా, ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా.. స‌మాజ‌ అభివృద్ధిలో టీచ‌ర్ల  పాత్ర‌ను విజ‌య‌సాయిరెడ్డి కొనియాడారు. విద్యార్థుల‌ను జ్ఞాన మార్గంలో న‌డుపుతూ, వారి బంగారు భ‌విష్య‌త్తును నిర్మిస్తున్నార‌ని చెప్పారు. అటువంటి టీచ‌ర్ల‌కు ఉపాధ్యాయ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.


More Telugu News