డ్రగ్స్ కేసు.. రానాను ఏడున్నర గంటలపాటు ప్రశ్నించిన ఈడీ

  • రానా బ్యాంకు ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు
  • కెల్విన్ ఎవరో తెలియదని చెప్పిన రానా
  • మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన వైనం
డ్రగ్స్ అంశం తెలుగు సినీ పరిశ్రమను వణికిస్తోంది. తాజాగా ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మి, నందు, రకుల్ ప్రీత్ సింగ్ విచారణను ఎదుర్కోగా... ఈరోజు రానా విచారణకు హాజరయ్యాడు. రానాను ఈడీ అధికారులు దాదాపు ఏడున్నర గంటల సేపు విచారించారు. మనీలాండరింగ్ కోణంలో రానా బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించిన అధికారులు... అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నించారు. ఎఫ్ క్లబ్ గురించి కూడా ప్రశ్నలు అడిగారు.

మరోవైపు డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఎవరో తనకు తెలియదని రానా చెప్పినట్టు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రానాను మీడియా చుట్టుముట్టింది. అయితే, మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండానే ఆయన తన కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


More Telugu News