జర్నలిస్టు తీన్మార్ మల్లన్నను కస్టడీలోకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
- కొన్ని రోజుల క్రితం అరెస్టు
- మల్లన్న డబ్బుల కోసం బెదిరిస్తున్నాడని ఓ వ్యక్తి ఫిర్యాదు
- మల్లన్నను ప్రశ్నించనున్న పోలీసులు
జర్నలిస్టు తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)ను కొన్ని రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన డబ్బుల కోసం బెదిరిస్తున్నాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఆయనను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 9 వరకు రిమాండ్ విధించడంతో, చంచల్‌గూడ జైలుకి తరలించారు.
నేటితో రిమాండ్ ముగుస్తుండడంతో మల్లన్నను ఒకరోజు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయనను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు ప్రశ్నించనున్నారు.