ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాల ఫిర్యాదుపై రంగంలోకి సీఐడీ.. తొలి కేసు నమోదు

  • ఫైబర్‌నెట్ ఎండీ ఫిర్యాదు మేరకు రంగంలోకి సీఐడీ
  • టెరా సాఫ్ట్‌వేర్ సంస్థకు అక్రమంగా టెండర్ కేటాయించారంటూ ఎఫ్ఐఆర్
  • అర్హత లేకున్నా ‘టెరా’కు రూ. 321 కోట్ల కాంట్రాక్ట్
  • 16 మంది వ్యక్తులు, రెండు సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులను నిందితులుగా చేర్చిన సీఐడీ
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ తొలి దశ టెండర్లలో చోటుచేసుకున్న అక్రమాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) టెండర్ల విషయంలో టెరాసాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ తుమ్మల గోపీచంద్, టెండర్ల మదింపు కమిటీ సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏపీఎస్ఎఫ్ఎల్ అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్టు సీఐడీ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.

అర్హత లేని టెరా సంస్థకు అక్రమంగా రూ. 321 కోట్ల కాంట్రాక్ట్ అప్పగించారని  ఆరోపించింది. అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండీ జులై 16న ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ ఏకంగా 774 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక ఆధారంగా ఈ నెల 9న కేసు నమోదు కాగా, నిన్న ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. మొత్తం 16 మంది వ్యక్తులు, రెండు సంస్థలు, కొందరు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా చేర్చింది.


More Telugu News