సాయితేజ్ కాలర్ బోన్ కు శస్త్రచికిత్స విజయవంతం

  • తాజా బులెటిన్ విడుదల చేసిన అపోలో ఆసుపత్రి
  • సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
  • క్రమంగా కోలుకుంటున్నాడని వివరణ
  • ఇటీవల యాక్సిడెంట్ కు గురైన సాయితేజ్
మెగా హీరో సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాదు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వర్గాలు తాజా బులెటిన్ విడుదల చేశాయి. సాయితేజ్ కాలర్ బోన్ కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. ఈ సర్జరీలో అనేక విభాగాలకు చెందిన వైద్యులతో కూడిన బృందం పాల్గొందని వివరించారు. సాయితేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, క్రమంగా మెరుగుపడుతోందని వెల్లడించారు. నిపుణులైన వైద్యబృందం పర్యవేక్షణలో సాయితేజ్ కు చికిత్స కొనసాగుతుందని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు.

ఈ నెల 10వ తేదీ సాయంత్రం హైదరాబాదులో స్పోర్ట్స్ బైకుపై వెళుతున్న సాయితేజ్ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రగాయాలపాలవడం తెలిసిందే. తొలుత స్థానికులు మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆపై జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి అపోలో ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో సాయితేజ్ కు చికిత్స జరుగుతోంది.


More Telugu News