కరోనా సోకిన చిన్నారుల్లో లక్షణాలు లేకుంటే ఆందోళన అక్కర్లేదు: నిపుణులు
- కేరళ, మిజోరం రాష్ట్రాల్లో చిన్నారుల్లో పెరుగుతున్న కేసులు
- యాక్టివ్ కేసుల్లో పదేళ్లలోపు చిన్నారుల శాతం పెరుగుదల
- చిన్నారుల్లో తీవ్ర లక్షణాలు అసాధారణమంటున్న నిపుణులు
కేరళ, మిజోరం తదితర రాష్ట్రాల్లో పదేళ్లలోపు చిన్నారులు ఎక్కువగా కరోనా బారినపడుతున్న నేపథ్యంలో నిపుణులు కీలక ప్రకటన చేశారు. పిల్లలకు కరోనా సోకినప్పటికీ వారిలో లక్షణాలు కనిపించకుంటే భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు తెలిపారు. ఒకవేళ చిన్నారుల్లో ఎక్కువమంది కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినా, ఇతర ఆరోగ్య సంబంధ సమస్యలు కనిపించినా వారి చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాలకు సూచించారు.
కాగా, ఈ ఏడాది మార్చి నుంచి దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో పదేళ్లలోపు చిన్నారుల శాతం పెరుగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరీ ముఖ్యంగా మిజోరం, మేఘాలయ, మణిపూర్, కేరళ రాష్ట్రాల్లో చిన్నారులు ఎక్కువగా కొవిడ్ బారినపడుతున్నారు.
మిజోరంలో మంగళవారం కరోనా బారినపడిన వారిలో 300 మంది చిన్నారులు ఉండడంతో ఆందోళన మొదలైంది. దీనిపై ‘ఎన్‌టాగి’కి చెందిన కొవిడ్ జాతీయ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ ఎన్‌కే అరోరా మాట్లాడుతూ.. చిన్నారులకు కరోనా సంక్రమించినట్టు తేలినా, వారిలో లక్షణాలు కనిపించకుంటే మాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు. వారు తీవ్రస్థాయిలో కరోనా బారినపడడం అత్యంత అసాధారణ విషయమని చెప్పారు.
ప్రస్తుతం ఆంక్షలు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ప్రయాణాలు ప్రారంభించారని, ఈ నేపథ్యంలో వారు కరోనా బారినపడే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. కరోనాతో పిల్లలు ఆసుపత్రిలో చేరినంత మాత్రాన మరణించే ప్రమాదం ఉందని భావించకూడదన్నారు.