జలాంతర్గాముల కొనుగోలు వివాదం... ఫ్రాన్స్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడనున్న బైడెన్
- ఆస్ట్రేలియా జలాంతర్గాముల ఒప్పందంతో వివాదం
- అమెరికా సబ్మెరీన్ల కోసం ఫ్రాన్స్ డీల్‌ను రద్దు చేసిన ఆసీస్
- ఆస్ట్రేలియా, అమెరికాలో ఫ్రెంచి రాయబారులు స్వదేశానికి
ఆస్ట్రేలియా-అమెరికా-బ్రిటన్ దేశాల మధ్య జరిగిన జలాంతర్గాముల ఒప్పందంపై ఫ్రాన్స్ ప్రభుత్వం గుర్రుగా ఉంది. 2016లోనే ఫ్రాన్స్ నుంచి జలాంతర్గాములు కొనుగోలు చేయడానికి ఆస్ట్రేలియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ అప్పట్లోనే 50 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు. ఈ ఒప్పందాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా.. అమెరికా నుంచి అణుశక్తితో నడిచే జలాంతర్గాములను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇలా చెప్పాపెట్టకుండా తమ దేశంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడంతో ఫ్రాన్స్‌కు కోపం వచ్చింది. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా, అమెరికాలోని వాషింగ్టన్లో ఉండే ఫ్రెంచి రాయబారులను స్వదేశానికి పిలిపించేసుకుంది. తమ ఆగ్రహం తెలియజేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలా ఈ రెండు దేశాల నుంచి ఫ్రెంచి రాయబారులు స్వదేశానికి తిరిగెళ్లిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి.
దీంతో ఫ్రాన్స్‌తో సంబంధాలు దెబ్బతినకుండా చూసుకునేందుకు బ్రిటన్, అమెరికా ప్రయత్నిస్తున్నాయి. ఈ డీల్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా ఫ్రెంచి మిత్రులకు ఆందోళన అక్కర్లేదని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌తో ఫోన్లో మాట్లాడటానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రయత్నిస్తున్నారట. ఈ మేరకు ఫ్రెంచి ప్రభుత్వాన్ని ఆయన కోరినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు దేశాధినేతల మధ్య ఫోన్ సంభాషణ జరుగుతుందని ఫ్రెంచి ప్రభుత్వ ప్రతినిధి గేబ్రియెల్ అట్టల్ తెలిపారు.