వివేకా హత్య కేసు: సీబీఐ ఎదుట హాజరైన మీడియా ప్రతినిధులు
- వివేకా హత్యకేసులో వాచ్ మన్ రంగయ్య వాంగ్మూలం
- రంగయ్య ఇంటర్వ్యూలు పలు చానళ్లలో ప్రసారం
- ఆయా చానళ్లను గుర్తించిన సీబీఐ
- చానళ్ల ప్రతినిధులకు నోటీసులు జారీ
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. పలు మీడియా చానళ్లకు చెందిన ప్రతినిధులు సీబీఐ ఎదుట హాజరయ్యారు. వివేకా హత్య కేసులో వాచ్ మన్ రంగయ్య వాంగ్మూలం కీలకంగా మారిన సంగతి తెలిసిందే. వాచ్ మన్ రంగయ్యను పలు మీడియా చానళ్ల ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. ఈ నేపథ్యంలో వాచ్ మన్ రంగయ్య ఇంటర్వ్యూలను ప్రసారం చేసిన చానళ్లను సీబీఐ గుర్తించింది. ఆయా చానళ్ల ప్రతినిధులకు సీబీఐ నోటీసులు పంపింది.