యువరైతు రాజేశ్ ఆత్మహత్య అంశంలో కేసీఆరే నేరగాడు: రేవంత్ రెడ్డి

  • మంచిర్యాల జిల్లాలో రైతు బలవన్మరణం
  • కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు మునక
  • పాలకుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడన్న రేవంత్
  • ఇకనైనా స్పందించాలని హితవు
మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన రాజేశ్ అనే 28 ఏళ్ల రైతు ఆత్మహత్య చేసుకోవడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా తన పంటలు మునిగిపోవడంతో రాజేశ్ బలవన్మరణం చెందాడన్న ఓ పత్రిక కథనాన్ని కూడా రేవంత్ పంచుకున్నారు.

పొలాల్లో పారాల్సిన నీరు పేదల కన్నీటి రూపంలో జాలువారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వాల్సిన పాలకుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడని పరోక్షంగా సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రాజేశ్ ఆత్మహత్య కేసులో కేసీఆరే నేరగాడు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతుల అంశంపై సీఎం కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి, మరో రైతు ఊపిరి పోకుండా చూస్తారా? అంటూ ట్వీట్ చేశారు.


More Telugu News