14 మంది టీడీపీ, 11 మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశాం: బాపట్ల డీఎస్పీ

  • గుంటూరు జిల్లా కొప్పర్రులో టీడీపీ నాయకురాలి ఇంటిపై దాడి
  • టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ
  • 50 మంది టీడీపీ, 21 మంది వైసీపీ కార్యకర్తలపై కేసుల నమోదు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో టీడీపీ నాయకురాలు శారద ఇంటిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 20న వినాయక నిమజ్జనం సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవ నేపథ్యంలో 14 మంది టీడీపీ, 11 మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినట్టు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

గొడవ నేపథ్యంలో గ్రామంలో అదనపు బలగాలను మోహరింపజేశామని ఆయన చెప్పారు. ఈ దాడిలో ఐదుగురు టీడీపీ, ఎనిమిది మంది వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిపారు. ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయని... వారి ఫిర్యాదు మేరకు 50 మంది టీడీపీ, 21 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశామని చెప్పారు. మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు.


More Telugu News