సమంత నటనతో ప్రేమలో పడిపోయానంటున్న బాలీవుడ్ హీరో
- ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో సమంత
- సమంత నటనకు సర్వత్రా ప్రశంసలు
- సామ్ పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన షాహిద్ కపూర్
- సమంతతో కలిసి నటించేందుకు ఆసక్తి
అందాల భామ సమంత నటనకు ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే! సినిమాల్లోనే కాదు వెబ్ సిరీస్ లలోనూ ఈ సొట్టబుగ్గల భామ తన యాక్టింగ్ టాలెంట్ తో రాణిస్తోంది. ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో సమంత నెగెటివ్ ఛాయలున్న రాజీ పాత్ర పోషించింది. ఇందులో సమంత నటనకు అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్ కూడా స్పందించాడు.
సమంత నటనతో ప్రేమలో పడిపోయానని చమత్కరించాడు. ఈ వెబ్ సిరీస్ యావత్తు తనను బాగా ఆకట్టుకున్న అంశం సమంత నటనేనని తెలిపాడు. ఆమెతో నటించాలని కోరుకుంటున్నానని, ఇప్పుడది తన కలగా మారిందని అన్నాడు. సమంతతో కలిసి నటించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని షాహిద్ కపూర్ పేర్కొన్నాడు.