భజన చేస్తూ కుప్పకూలిన బాబా.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి

  • మహారాష్ట్రలో జరిగిన విషాద ఘటన
  • కార్యక్రమం ప్రారంభమయ్యాక స్టేజిపై కీర్తనలు పాడిన బాబా
  • మధ్యలో గుండెనొప్పితో కుప్పకూలడంతో భక్తుల ఆందోళన
భక్తులందరి ముందు నిలబడి పరవశంతో కీర్తనలు పాడుతున్న బాబా ఉన్నట్లుండి కుప్పకూలారు. ఆందోళన చెందిన భక్తులు ఏమైందా? అని చూస్తే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు అర్థమైంది. దీంతో బాబాను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ మార్గమధ్యంలోనే బాబా కన్నుమూశారు.

ఈ ఘటన మహారాష్ట్రలోని నిజాంపూర్ సమీపంలోని జామ్దాలో జరిగింది. సోమవారం నాడు ఇక్కడ జరిగిన ఒక భజన కార్యక్రమానికి కీర్తంకర్ తాజుద్దీన్ బాబా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా రాత్రిపూట గ్రంథరాజ్ జ్ఞానేశ్వరి మహరాజ్ పారాయణ సప్తాహ్ ఆలపించడం ప్రారంభించారు. ఆలపించే మధ్యలోనే గుండెపోటు రావడంతో ఆయన గుండె పట్టుకొని పడిపోయారు.

దీంతో ఆందోళన పడిన భక్తులు ఆయన్ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ మార్గమధ్యంలోనే బాబా కన్నుమూశారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


More Telugu News