సిద్ధూకు ఫోన్ చేసి మాట్లాడిన పంజాబ్ సీఎం
- సిద్ధూ-కెప్టెన్ వార్ విషయంలో సిద్ధూతో మాట్లాడినట్లు వెల్లడి
- పార్టీ చీఫ్ ఎవరైనా సరే, అతను కుటుంబ పెద్ద వంటి వాడు
- రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన విద్యుత్ కొరత
- గ్రామాల్లో చాలా ఇళ్లలో మీటర్లు తొలగించిన వైనం
- ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ
పంజాబ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సిద్ధూ-కెప్టెన్ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందించారు. తాను సిద్ధూకి ఫోన్ చేసినట్లు చెప్పారు. ‘‘పార్టీ చీఫ్ ఎవరైనా సరే, అతను కుటుంబ పెద్ద వంటి వాడు. అందుకే నేను సిద్ధూకు ఫోన్ చేశా. కూర్చొని మాట్లాడుకుందామని, సమస్యను పరిష్కరించుకుందామని చెప్పా’ అని పేర్కొన్నారు.
ఇక రాష్ట్ర సమస్యలపై స్పందిస్తూ, తాను రెగ్యులర్‌గా గ్రామాల్లో పర్యటిస్తున్నానని, అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ప్రధాన సమస్యగా ఉందని తెలిపారు. భారీగా ఉన్న బిల్లులు కట్టకపోవడంతో చాలా ఇళ్లలో మీటర్లు కూడా తొలగించారని చన్నీ తెలిపారు. కాంగ్రెస్‌లో సిద్ధూ వర్గానికి చన్నీ సన్నిహితుడనే సంగతి తెలిసిందే.
పంజాబ్‌లో ఎలక్ట్రిసిటీ సమస్యపై కూడా చన్నీ స్పందించారు. రాష్ట్రంలో కరెంటు బిల్లులు కట్టలేని 53 లక్షల కుటుంబాల బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పారు. వీరిలో 75-80శాతం మంది 2కేడబ్ల్యూ కేటగిరీలోకి వస్తారని, వీరి చివరి బిల్లులను తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. బిల్లులు కట్టలేదని తొలగించిన కనెక్షన్లను మళ్లీ పునరుద్ధరిస్తామని తెలిపారు.