'రాధే శ్యామ్' ప్రమోషన్స్ మొదలెట్టేస్తారట!
- 1960ల నాటి అందమైన ప్రేమకథ
- ఇటలీ నేపథ్యంలో సాగే కథ
- దసరా నుంచి ప్రమోషన్స్ మొదలు
- జనవరి 14వ తేదీన విడుదల
ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధే శ్యామ్' రెడీ అవుతోంది. ఇటలీ నేపథ్యంలో 1960ల నాటి ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ వారు .. టి సిరీస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో, జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొంతకాలం క్రితం ప్రకటించారు. అయితే ఈ సినిమా అప్ డేట్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడం అందరికీ అసంతృప్తిని కలిగించింది. ఈ సినిమా ప్రమోషన్స్ ను సాధ్యమైనంత త్వరలో మొదలుపెట్టనున్నట్టుగా నిర్మాతలు చెప్పారు.
అలాగే ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయనున్నామంటూ స్పష్టం చేశారు. దసరా నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నట్టుగా తెలుస్తోంది. కృష్ణంరాజు .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. చాలా కాలం తరువాత బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఈ సినిమాలో నటించడం విశేషం.