డ్రగ్స్ కేసు విచారణలో కన్నీరు ఆపుకోలేకపోయిన షారుఖ్ ఖాన్ కుమారుడు!
- మొన్న రాత్రి ఆర్యన్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ
- ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరిని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు
- ప్రస్తుతం కస్టడీలో ఆర్యన్
- నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేల్చిన అధికారులు
ముంబై రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం, విక్రయాల కేసులో బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతోన్న విషయం తెలిసిందే. విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్ కన్నీరు ఆపుకోలేపోయాడని, ఏడుస్తూనే గడిపాడని అధికారులు చెప్పారు. అతడు నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలిందని వివరించారు.
ఆర్యన్ విదేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకుంటూనే ఉండేవాడని తెలిపారు. కాగా, నిన్న ఆర్యన్, అర్బాన్, మున్మున్‌లను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం వారు ఎన్సీబీ కస్టడీలో ఉన్నారు. ఆర్యన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో ఐదుగురిని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తన కొడుకును బెయిల్‌పై విడుదల చేయించడానికి షారుఖ్ లాయర్ ద్వారా ప్రయత్నాలు జరుపుతున్నాడు. తన షూటింగ్ కార్యక్రమాలను కూడా షారుఖ్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.