టీడీపీకి షాక్.. కాకినాడ మేయర్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

  • మేయర్ పావనిపై అవిశ్వాస తీర్మానం
  • పావనికి ఒక్కరు కూడా చేయి ఎత్తని వైనం
  • 2017 కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికలు
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. మేయర్ పావనిపై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో, ఆమె పదవిని కోల్పోయారు.

అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 36 ఓట్లు వచ్చాయి. టీడీపీకి చెందిన 21 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయాగా, 9 మంది టీడీపీ కార్పొరేటర్లు తటస్థంగా ఉండిపోయారు. ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. వీరిలో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి ఉన్నారు.  

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు 2017లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 30, వైసీపీకి 8, బీజేపీకి 3 సీట్లు రాగా... ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు.


More Telugu News