'మా' అధ్య‌క్షుడిగా తెలుగు వారినే ఎన్నుకోవాలి: నటుడు ర‌విబాబు కీల‌క వ్యాఖ్య‌లు

  • తెలుగు న‌టుల కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ 'మా'  
  • మా సంస్థ‌ను న‌డిపేందుకు తెలుగు వారిలో ఒక‌రైనా ప‌నికిరారా?
  • ఇప్ప‌టికే నిర్మాత‌లు బ‌య‌టి నుంచే క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌ను తీసుకొస్తున్నారు
  • వారి డిమాండ్ల‌కు ఒప్పుకుంటున్నారు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లకు స‌మయం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు మ‌ద్ద‌తుదారులు ప‌ర‌స్ప‌రం మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా మంచు విష్ణుకు మ‌ద్ద‌తుగా న‌టుడు ర‌విబాబు మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో మా అధ్య‌క్షుడిగా తెలుగు వారినే ఎన్నుకోవాలని చెప్పారు.  

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అనేది తెలుగు న‌టుల కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ  అని ఆయ‌న అన్నారు. మా సంస్థ‌ను న‌డిపేందుకు తెలుగు వారిలో ఒక‌రైనా ప‌నికిరారా? అని ఆయ‌న నిల‌దీశారు. ఇప్ప‌టికే నిర్మాత‌లు బ‌య‌టి నుంచే క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌ను తీసుకొస్తున్నార‌ని, వారి డిమాండ్ల‌కు ఒప్పుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. హైద‌రాబాద్‌లో దాదాపు 200 మంది కెమెరామెన్లకు ప‌ని లేదని ఆయ‌న చెప్పారు.

ఇప్ప‌టికే బ‌య‌టినుంచి తెచ్చుకునే వారికి ఇచ్చే బిల్లులు చూసి నిర్మాత‌లు భ‌య‌ప‌డిపోతున్నారని ఆయ‌న అన్నారు. ముంబై నుంచే మేక‌ప్‌మెన్, హెయిర్ డ్రెస‌ర్లు వ‌స్తున్నారని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికైనా తెలుగు న‌టుల‌ను ప‌ట్టించుకోవాల‌ని ఆయ‌న కోరారు. కాగా, ప్ర‌కాశ్ రాజ్ నాన్ లోక‌ల్ అంటూ కొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే.


More Telugu News