ఏపీ సర్కారు దివాలా అంచుల్లో ఉంది... రూ.6 లక్షల కోట్ల అప్పు చేశారు: ఉండవల్లి

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందంటూ వ్యాఖ్యలు
  • అమరావతిని కూడా తాకట్టు పెడుతున్నారని వెల్లడి
  • సలహాదారులు ఏంచేస్తున్నారన్న ఉండవల్లి
  • ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రెస్ మీట్
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని, ప్రభుత్వ అప్పులు రూ.6 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు. ఇదే పరిస్థితి ఇక ముందు కూడా కొనసాగితే రాష్ట్రం కోలుకోవడం కష్టమని, దివాలా తీయడం తథ్యమని అభిప్రాయపడ్డారు. అమరావతిని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జగన్ సర్కారు ఎంతోమందిని సలహాదారులుగా నియమించుకుందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే వారంతా ఉండి ఏం ప్రయోజనం? అని ఉండవల్లి ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోయినప్పటికీ మంత్రులు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉందని వెల్లడించారు. నిర్వాసితుల సమస్యలు తొలగిపోనేలేదని అన్నారు.


More Telugu News