'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- అఖిల్ నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
- ఈ నెల 15వ తేదీన విడుదల
- ముఖ్యమైన పాత్రలో ఆమని
అఖిల్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా రూపొందింది. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఈషా రెబ్బా .. ఫరియా అబ్దుల్లా ముఖ్యమైన పాత్రల్లో మెరవనున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. "అరెరే ఎవరూ ఏం చెప్పలేదా ఒకసారి, ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా" అంటూ ఈ పాట సాగుతోంది. గోపీసుందర్ బాణీకి సిరివెన్నెల సాహిత్యాన్ని అందించగా, జియా ఉల్ హక్ ఆలపించాడు.
విజయదశమి కానుకగా ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఆమని .. పోసాని .. మురళీ శర్మ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి అఖిల్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.