'సత్యాగ్రహి' చిత్రాన్ని గుర్తుచేసుకున్న పవన్!
- 2003లో ప్రారంభమై, ఆగిపోయిన 'సత్యాగ్రహి'
- లోక్ నాయక్ ప్రేరణతో చేయాలనుకున్న సినిమా
- నిజజీవితంలో అలా ప్రవర్తిస్తున్నందుకు సంతృప్తిగా ఉందన్న పవన్
ఒక్కోసారి కొన్ని సినిమాలు ఆర్భాటంగా ప్రారంభించడం.. తదనంతరం అవి ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి. అలా ఆగిపోవడానికి బోలెడు కారణాలుంటాయి. స్టార్ హీరోల విషయంలో కూడా ఇలాంటి ఉదంతాలు చాలానే వున్నాయి.
అలాగే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో కూడా అలాంటి సినిమా ఒకటుంది. అదే 'సత్యాగ్రహి'. రాజకీయ నేపథ్యంతో సాగే కథతో పవన్ ఈ చిత్రం చేస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, అనుకోకుండా ఆ చిత్రం మొదట్లోనే ఆగిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని పవన్ కల్యాణ్ తనే గుర్తుచేసుకున్నారు.
'లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన నాటి ఎమర్జన్సీ కాలం నాటి ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకుని చేయాలనుకున్న చిత్రం అది. 2003లో అనుకుంటా, దాని ప్రారంభం కూడా జరిగింది. అంతలోనే అది ఆగిపోయింది. అయితే, ఆ సినిమాలో నటించడం కన్నా, ఇప్పుడు నిజ జీవితంలో ఆలా ప్రవర్తించగలగడమే నాకు సంతృప్తిని ఇస్తోంది' అంటూ పవన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడిది వైరల్ అవుతోంది.