టీ20 వరల్డ్ కప్: పాపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఒమన్ ఘనవిజయం
- నేటి నుంచి టీ20 వరల్డ్ కప్
- తొలి మ్యాచ్ లో తలపడిన ఒమన్, పాపువా న్యూగినియా
- బోణీ కొట్టిన ఒమన్
- అద్భుతంగా ఆడిన ఓపెనర్లు
- 13.4 ఓవర్లలోనే లక్ష్యఛేదన
టీ20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లో ఒమన్ బోణీ కొట్టింది. పాపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్ లో ఒమన్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 130 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే ఛేదించింది. ఒమన్ ఓపెనర్లు జతీందర్ సింగ్, ఆకిబ్ ఇలియాస్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఒమన్ ఒక్క వికెట్టూ కోల్పోకుండా గెలుపు తీరాలకు చేరింది.
ముఖ్యంగా జతీందర్ సింగ్ పాపువా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ భారత సంతతి ఆటగాడు కేవలం 42 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. ఆకిబ్ ఇలియాస్ 43 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ తో 50 పరుగులు సాధించాడు. పాపం, పాపువా న్యూగినియా జట్టు ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించినా ఒక్క వికెట్టు కూడా తీయలేకపోయింది.