టీ20 వరల్డ్ కప్: సూపర్-12 బెర్తు కోసం పాపువా న్యూ గినియాతో బంగ్లాదేశ్ ఢీ

  • టీ20 వరల్డ్ కప్ లో కొనసాగుతున్న తొలిదశ పోటీలు
  • ఈ మ్యాచ్ లో గెలిస్తే బంగ్లాదేశ్ ముందంజ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా
  • ఆరంభంలోనే ఓపెనర్ నయీం డకౌట్
టీ20 వరల్డ్ కప్ లో తొలి రౌండు పోటీలు కొనసాగుతున్నాయి. నేడు బంగ్లాదేశ్ జట్టు పాపువా న్యూ గినియా జట్టుతో తలపడుతోంది. అల్ అమేరత్ మైదానం ఆతిథ్యమిస్తోన్న ఈ పోరులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే బంగ్లాదేశ్ జట్టు సూపర్-12 దశకు చేరుకుంటుంది.

కాగా, బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మహ్మద్ నయీం డకౌట్ అయ్యాడు. పాపువా న్యూ గినియా బౌలర్ కబువా మొరియాకు ఈ వికెట్ దక్కింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 8 పరుగులు. క్రీజులో ఓపెనర్ లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్ ఉన్నారు.


More Telugu News