ఏమిటీ 'ప్రాప్ గన్'.. డమ్మీ తుపాకీతో కూడా చనిపోయే ముప్పుందా?
- కొన్ని సందర్భాల్లో నిజమైన తుపాకీతోనే షూటింగ్
- బుల్లెట్లు తీసేసి ఖాళీ కార్ట్రిడ్జ్ తో వినియోగం
- గన్ పౌడర్, కేసింగ్ యథావిధిగా
- నిపుణుల సమక్షంలోనే వాడకం
మామూలుగా సినిమాల్లో షూటింగ్ సన్నివేశాలు వచ్చినప్పుడు డమ్మీ తుపాకులను వినియోగిస్తుంటారు. అప్పుడప్పుడు చిన్నాచితకా ప్రమాదాలు వాటితోనూ జరుగుతుంటాయి. అయితే, 'రస్ట్' సినిమా షూటింగ్ లో డమ్మీ తుపాకీ పేలే సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ చనిపోయింది. మరి డమ్మీ (ప్రాప్) తుపాకులతో కూడా చనిపోతారా? అనే అనుమానం చాలా మందికి వస్తుంటుంది. వాస్తవానికి ఆ తుపాకులతోనూ తీవ్రమైన పరిణామాలు కలుగుతుంటాయి. ఒక్కోసారి ఇలా ప్రాణాల మీదకూ వస్తుంది.
ఎంటర్ టైన్ మెంట్ కోసం వాడే ఏదైనా మారణాయుధాలను ‘ప్రాప్’ ఆయుధాలుగా పిలుస్తుంటారు. థియేటర్ ప్రొడక్షన్స్, రేంజ్ తదితర వాటి కోసం వాటిని వాడుతుంటారు. చాలా మంది అవి పనిచేయవని అనుకుంటారు. కేవలం తుపాకుల్లా కనిపించేవాటిని మాత్రమే వాడుతుంటారని భావిస్తుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో నిజమైన తుపాకులనూ వాడుతుంటారు.
నిజమైన వాటిలా అనిపించేందుకు కేవలం క్లోజప్ షాట్స్ లోనే వాటిని వాడుతుంటారు. వారి పక్కన తుపాకులను పర్ ఫెక్ట్ గా హ్యాండిల్ చేసే నిపుణుడిని పెట్టాల్సి ఉంటుంది. సరిగ్గా వాడుతున్నారో లేదో చూడాలి. నిజమైన తుపాకీని వాడేటప్పుడు బుల్లెట్లు లేకుండా కార్ట్రిడ్జ్ ను లోడ్ చేస్తారు. మిగతావన్నీ ఆ తుపాకీలో కామన్ గా ఉంటాయి. బుల్లెట్లు లేకపోయినా.. కేసింగ్, గన్ పౌడర్, ఫైరింగ్ పిన్ వంటివన్నీ ఉంటాయి. ఈ క్రమంలో తుపాకీ పేల్చినప్పుడు పెద్ద శబ్దంతో గన్ పౌడర్ మండుతుంది.
ఇలాంటి వాటితో ఎవరైనా పేల్చినప్పుడు.. వారికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యే ప్రమాదముంటుంది. తగలరానిచోట తగిలితే చనిపోయే ముప్పు అధికంగానే ఉంటుంది. ఇప్పుడు ‘రస్ట్’ సినిమా విషయంలోనూ అదే జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే, పూర్తిగా మాత్రం నిర్ధారించలేదు. ప్రాప్ గన్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు.