పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారు: మావోయిస్టు నేత జగన్

  • నిన్న జరిగింది బూటకపు ఎన్ కౌంటర్
  • ఒక ద్రోహి తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే ఎన్ కౌంటర్ జరిగింది
  • ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది
ములుగు జిల్లాలోని టేకులగూడ అటవీప్రాంతలో నిన్న జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన పేరిట ఒక లేఖ విడుదల అయింది. ఒక ద్రోహి తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే ఎన్ కౌంటర్ జరిగిందని అన్నారు. ఏకపక్షంగా పోలీసులు కాల్పులు జరిపారని మండిపడ్డారు. సామాన్య ప్రజలను తెలంగాణ ప్రభుత్వం చంపుతోందని అన్నారు.

తన పాలన చాలా గొప్పగా ఉందని చెప్పుకోవడానికే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని నిర్వహిస్తున్నారని చెప్పారు. కల్లబొల్లి మాటలు చెపుతూ ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని దుయ్యబట్టారు. పేదలకు అండగా ఉన్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం... పోడు పేరుతో ఆదివాసీలను మోసం చేస్తున్నమాట నిజం కాదా? అని ప్రశ్నించారు.

నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో రీజనల్ సెంటర్ సీఆర్సీ కంపెనీ-2కు చెందిన కామ్రేడ్ నరోటి దామాల్, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గట్ట ప్రాంతానికి చెందిన పూనెం భద్రు, బీజాపూర్ జిల్లా పెద్దకోర్మ గ్రామానికి చెందిన సోడి రామాల్ అలియాస్ సంతోష్, బీజాపూర్ జిల్లా బాసగూడెం ప్రాంతం మల్లిపాడుకుచెందిన మరో కామ్రేడ్ మరణించారని జగన్ తెలిపారు.


More Telugu News