స్కాట్లాండ్ టాపార్డర్ ను హడలెత్తించిన నమీబియా బౌలర్లు

  • అబుదాబిలో స్కాట్లాండ్ వర్సెస్ నమీబియా
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్
  • తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసిన ట్రంపుల్ మన్
  • 8 వికెట్లకు 109 పరుగులు చేసిన స్కాట్లాండ్
టీ20 వరల్డ్ కప్ సూపర్-12కు అర్హత సాధించిన స్కాట్లాండ్, నమీబియా అబుదాబి వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ ఆశించిన మేర ఆడలేకపోయింది. మొత్తమ్మీద 20 ఓవర్లు ఆడి 8 వికెట్లకు 109 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ తొలి ఓవర్లోనే 3 వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది. లెఫ్టార్మ్ సీమర్ రూబెన్ ట్రంపుల్ మన్ అద్భుతమైన బౌలింగ్ తో స్కాట్లాండ్ టాపార్డర్ ను కకావికలం చేశాడు. అయితే, లోయరార్డర్ లో లీస్క్ 44, క్రిస్ గ్రీవ్స్ 25 పరుగులు చేయడంతో స్కాట్లాండ్ స్కోరు 100 పరుగులు దాటింది. నమీబియా బౌలర్లలో ట్రంపుల్ మన్ 3, ఫ్రైలింక్ 2, స్మిట్ 1, వీజ్ 1 వికెట్ తీశారు.


More Telugu News