లీ కూపర్ బ్రాండ్ ను సొంతం చేసుకున్న రిలయన్స్

  • దుస్తుల రంగంలో అగ్రగామిగా ఉన్న లీ కూపర్
  • 1908లో ప్రారంభం
  • 126 దేశాల్లో విస్తరణ
  • ఐకానిక్స్ లైఫ్ స్టైల్ తో కలిసి కొనుగోలు చేసిన రిలయన్స్
లీ కూపర్... ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అయ్యేవారికి ఈ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డెనిమ్ దుస్తుల రంగంలో లీ కూపర్ అగ్రగామిగా ఉంది. బ్రిటన్ కు చెందిన ఈ లైఫ్ స్టైల్ బ్రాండ్ 1908 నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. తాజాగా లీ కూపర్ ను రిలయన్స్ సంస్థ చేజిక్కించుకుంది. ఐకానిక్స్ లైఫ్ స్టైల్ ఇండియాతో కలిసి రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ లీ కూపర్ మేధోసంపత్తి హక్కులను కొనుగోలు చేసింది. కాస్త ఖరీదు ఎక్కువే అయినా నాణ్యమైన, ఫ్యాషనబుల్ దుస్తులకు లీ కూపర్ పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రిటీష్ బ్రాండ్ 126 దేశాల్లో విస్తరించి ఉంది.


More Telugu News