టీ20 వరల్డ్ కప్: ఆస్ట్రేలియా టార్గెట్ 155 రన్స్
- టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12
- గ్రూప్-1లో ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసిన లంక
టీ20 వరల్డ్ సూపర్-12 పోరులో ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. భానుక రాజపక్స 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు, కుశాల్ పెరెరా 35, చరిత్ అసలంక 35 పరుగులతో రాణించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, పాట్ కమిన్స్ 2, ఆడమ్ జంపా 2 వికెట్లు తీశారు. మ్యాక్స్ వెల్ ఒక ఓవర్ వేయగా, అందులో 16 పరుగులు రాబట్టిన లంకేయులు... స్టొయినిస్ వేసిన 3 ఓవర్లలో 35 పరుగులు సాధించారు.