కొత్త రికార్డులు సెట్ చేస్తున్న 'పుష్ప' సామీ!
- ఫస్టు సింగిల్ గా వచ్చిన 'దాక్కో దాక్కో'
- సెకండ్ సింగిల్ గా అలరించిన 'శ్రీవల్లి'
- మూడో సింగిల్ గా పలకరించిన 'సామీ సామీ'
- డిసెంబర్ 17వ తేదీన విడుదల
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. అడవి నేపథ్యంలో .. ఎర్రచందనం అక్రమరవాణా చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథ ఇది. అడవి సమీపంలోని గిరిజన గూడెం .. ఆ గూడెంలోని శ్రీవల్లితో ముడిపడిన అందమైన ప్రేమకథ ఇది. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషన్ పాళ్లు పుష్కలంగా కనిపించనున్నాయి.
భారీ బడ్జెట్ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు కూడా రాకెట్ మాదిరి జనంలోకి దూసుకుపోయాయి. రీసెంట్ గా వచ్చిన 'సామీ .. సామీ' సాంగ్ కూడా ఒక రేంజ్ లో దూసుకుపోతుండటం విశేషం. సాహిత్యం పరంగా చంద్రబోస్ ఈ పాటను జానపదానికి దగ్గరగా తీసుకెళ్లాడు.
ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా వచ్చిన 'దాక్కో దాక్కో మేక' 24 గంటలలో 8.3 మిలియన్ వ్యూస్ ను రాబట్టి కొత్త రికార్డును సెట్ చేసింది. ఇక నిన్న వదిలిన 'సామీ .. సామీ' పాట 24 గంటలలోగా 8.5 మిలియన్ వ్యూస్ ను రాబట్టి .. ఫస్టు సింగిల్ రికార్డును బీట్ చేసింది. ఇలా 'పుష్ప' తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ వెళుతుండటం విశేషం. ఈ సినిమాలో సునీల్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.