టీ20 వరల్డ్ కప్: ఆస్ట్రేలియాను అలవోకగా ఓడించిన ఇంగ్లండ్
- సూపర్-12లో గ్రూప్-1 పోరు
- మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్
- 20 ఓవర్లలో 125 ఆలౌట్
- 11.4 ఓవర్లలోనే ఛేదించిన ఇంగ్లండ్
- బట్లర్ 32 బంతుల్లో 71 నాటౌట్
- 5 ఫోర్లు, 5 సిక్సులు బాదిన బట్లర్
దుబాయ్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ గ్రూప్-1 పోరులో ఇంగ్లండ్ జట్టు అన్ని రంగాల్లో రాణించి ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 11.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ జోస్ బట్లర్ ఆటే హైలైట్ అని చెప్పాలి. ప్రత్యర్థి బౌలర్ ఎవరని కూడా చూడకుండా ఉతికి ఆరేశాడు. బట్లర్ కేవలం 32 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ 5 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. మరో ఓపెనర్ జాసన్ రాయ్ 20 బంతుల్లో 22 పరుగులు చేయగా, బెయిర్ స్టో 11 బంతుల్లో రెండు సిక్సుల సాయంతో 16 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆస్టన్ అగర్ 1, ఆడమ్ జంపా 1 వికెట్ తీశారు.